ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు

ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు

స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాలేజీల్లో ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విసిగిస్తుంటారు. కొన్నిసార్లు ఇది మితిమీరి ప్రాణాల మీదకు తెస్తుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి అనుకుంది ఒక పదమూడేళ్ల అమ్మాయి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘యాంటీ బుల్లీయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను’ ఏర్పాటు చేసింది.

గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అనుష్క జాలి, పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇండియాలో ఉన్న స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నింటిలో ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా చేయాలని అనుష్క ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘యాంటీ బుల్లీయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటుచేసింది. అంతే కాదు ‘కవచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా వాళ్ల స్కూల్లో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేసింది.  

ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చు. కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన వాళ్ల వివరాలు బయటికిరావు. కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీద కౌన్సెలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా కాలేజీ యాజమాన్యం యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటారు. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడి ఇప్పటి వరకు వంద స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూనివర్సిటీల్లో 2000  మందికి పైగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుండి బయటపడ్డారు. 

అంతేకాదు రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సోని టీ.వీలో ప్రసారమయ్యే ‘షార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా’కు వెళ్లి తన ఐడియాను చెప్పింది. దానికి ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ఇన్వెస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుపమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుప్తా, ఆ యాప్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

‘నా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక చిన్న పిల్లని ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఏడిపించారు. ఇలా చాలామంది ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల బాధపడటం చూసాను. ర్యాగింగ్ తీవ్రతను అర్థం చేసుకుని, ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేశాను. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం కోసం ఇంత మంచి ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందని ఊహించలేదు’ అంటోంది అనుష్క.