తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియర్స్ ఇవాళ్లి నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రకటించిన బంపర్ ఆఫర్ కు విశేష స్పందన వస్తోంది. ప్రతి నిమిషానికి దాదాపు 700 పెండింగ్ చలానాలను అధికారులు క్లియర్ చేస్తున్నారు.. ఈ నెల 31వరకు పెండింగ్ ట్రాఫిక్ చాలన్ లు కట్టడానికి అవకాశం ఇస్తున్నాట్లు తెలిపారు అధికారులు. చాలన్ లు ఆన్ లైన్, గూగూల్ పే, ఫోన్ పే, మీ సేవా, టీ సేవా కేంద్రాల నుంచి చెల్లించవచ్చని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. కరోన కాలంలో ఆర్థికంగా చితికిపోయిన ఉద్యోగులు, వ్యాపారుల ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రజానికానికి ఉమశమనం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. టూవీలర్ వాహనదారులకు పెండింగ్ చలాన్ లో 75 శాతం డిస్కౌంట్, కార్లు, పెద్ద మోటార్ వాహనదారులకు 50 పర్సంట్ డిస్కౌంట్ ప్రకటించారు.
మరిన్ని వార్తల కోసం: