నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం
  • ఉక్రెయిన్​లో మన స్టూడెంట్లపై.. సైన్యం దాడులు
  • పెప్పర్​ స్ప్రే కొడుతూ అడ్డుకుంటున్నరని స్టూడెంట్ల ఆవేదన
  • 12 గంటలుగా నీళ్లు, బువ్వ లేకుండా క్యూలోనే ఉన్నం: స్టూడెంట్
  • కీవ్‌‌‌‌లో హాస్టల్‌‌‌‌లో 200 మంది చిక్కుకుపోయాం: మరో స్టూడెంట్

కీవ్: ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న తటస్థ వైఖరి.. అక్కడి ఇండియన్లకు ఇబ్బందికరంగా మారింది. తమకు ఇండియా మద్దతివ్వలేదన్న కోపంతో.. ఉక్రెయిన్ సోల్జర్లు, పోలీసులు మన స్టూడెంట్లపై దాడులకు పాల్పడుతున్నారు. కొడుతున్నరు, తన్నుతున్నరు, పెప్పర్, చిల్లీ స్ప్రే కొడుతున్నరు. కొందరు మహిళలను ఉక్రెయిన్ గార్డులు కొట్టడం ఓ వీడియోలో కనిపించింది. కొందరు వ్యక్తులతో కలిసి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఓ సైనికుడు తన్నడం మరో వీడియోలో కనిపించింది. అయితే అతడు ఇండియన్‌‌‌‌ స్టూడెంటా కాదా? అనేది స్పష్టంగా తేలలేదు. కానీ మన వాళ్లపై ఉక్రెయిన్ బార్డర్‌‌‌‌‌‌‌‌లో దాడులు, వేధింపులు మాత్రం జరుగుతున్నాయి. చాలా మంది వీడియోలు రికార్డు చేసి మరీ తమ గోడు వెళ్లబోసుకుంటున్నరు.

ఏం చేయాల్నో అర్థమైతలే.. భయమైతంది..
‘‘ఉక్రెయిన్, స్లొవేకియా బార్డర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో చిక్కుకుపోయాం. నేను, మరికొందరు దాదాపు 12 గంటలుగా ఆహారం, నీళ్లు లేకుండా పడిగాపులు కాస్తున్నాం. సైనికులు మాపై పలుమార్లు పెప్పర్, చిల్లీ స్ర్పేలు కొట్టారు. దీంతో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. సాయం కోసం స్లొవేకియా ఎంబసీని కాంటాక్ట్ చేశాం. కీవ్ ఎంబసీకి కూడా ఫోన్‌‌‌‌ చేశాం. కానీ అవి ఔట్‌‌‌‌ ఆఫ్ సర్వీస్. హెల్ప్‌‌‌‌లైన్, ఎమర్జెన్సీ నంబర్లు పని చేయడంలేదు. ‘మేం ఏం చేయలేం’ అని చెబుతున్నారు. మేం ఇక్కడ ఇలానే నిలబడ్డాం. ఏం చేయాలో, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కావడం లేదు” అని మాళవిక అనే స్టూడెంట్ వాపోయింది. తాము కీవ్‌‌‌‌లోనే చిక్కుకుపోయామని, చాలా భయంగా ఉందని మరికొందరు ఇండియన్ స్టూడెంట్లు చెప్పారు. ‘‘మా హాస్టల్‌‌‌‌లో ఫైరింగ్ జరుగుతోంది. కొందరు గన్‌‌‌‌మెన్‌‌‌‌ మా హాస్టల్‌‌‌‌లోకి వచ్చారు. మా లొకేషన్ కోఆర్డినేట్స్ తీసుకున్నారు. వాళ్లు ఉక్రెయిన్ సోల్జర్లా, లేక రష్యా సైనికులా అర్థం కాలేదు. మాకు ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు” అని వారు చెప్పారు.

అందరూ క్యూలో ఎదురుచూడాలె: ఉక్రెయిన్ అంబాసిడర్
‘‘క్యూలో ఎదురు చూడాలని అక్కడ సూచిస్తున్నారు. కానీ కొందరు తామంతట తాము వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అందరూ క్యూలో ఎదురుచూడాల్సిందే. భయాందోళన సృష్టించడాన్ని ఇండియా మీడియా ఆపాలె” అని మండిపడ్డారు.

కరోనా ఆంక్షల సడలింపు
ఉక్రెయిన్ నుంచి వస్తున్న స్టూడెంట్లకు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, ఎయిర్ సువిధ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేయడం వంటి వాటి నుంచి మినహాయింపు ఇస్తున్న ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకాలను రివైజ్ చేశామని, కొన్ని మినహాయింపులు ఇచ్చామని పేర్కొంది.

స్టూడెంట్లను తేవడానికి కేంద్ర మంత్రులు
ఉక్రెయిన్‌‌‌‌లో చిక్కుకున్న స్టూడెంట్లు సహా ఇండియన్లందరినీ దేశానికి తీసుకొచ్చేందు కు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేం దుకు నలుగురు మంత్రులను ఉక్రెయిన్ చుట్టుపక్క దేశాలకు పంపనుంది. సోమవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం నుంచి ప్రత్యేక రాయబారులుగా కేంద్ర మంత్రులు హర్‌‌‌‌‌‌‌‌దీప్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్‌‌‌‌లను పంపనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రుమేనియా, మాల్డోవా దేశాల్లో చిక్కుకున్న వాళ్లను తరలించే ప్రక్రియను సింధియా పర్యవేక్షిస్తారు. స్లొవేకియాకు రిజిజు, హంగేరికి హర్‌‌‌‌‌‌‌‌దీప్, పోలాండ్‌‌‌‌కు వీకే సింగ్ వెళ్లి సమన్వయం చేస్తారు. ఈ హైలెవెల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో కేంద్ర మంత్రులు జైశంకర్, పియూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఫారిన్ సెక్రెటరీ హర్షవర్ధన్​ ష్రింగ్లా తదితరులు పాల్గొన్నా రు. ఉక్రెయిన్ సంక్షోభంపై మోడీ ఆదివారం కూడా రివ్యూ నిర్వహించారు.