హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ఎన్నికలు వాయిదా పడ్డాయి. పలుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక పాలకమండలి ఎన్నికను వాయిదావేస్తున్న ట్లు అధికారులు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్,ఇంద్రేశం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు, జనగామ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, నిర్మల్ జిల్లా ఖానాపూర్, మంచి ర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీం పట్నం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ బల్దియాలో చైర్మన్, వైస్ చైర్మనేపేర్లు ఇంకా ఫిక్స్ కాలేదు.
కుదరని ఏకాభిప్రాయం
నిర్మల్: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడింది. 12 మంది కొన్ని లర్లకు గాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు, ఒక్క ఇండి పెండెంట్ కౌన్సిలర్ మాత్రమే సమావేశానికి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా నలుగురు బీజేపీ సభ్యులు, నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైరాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నికలు వాయిదా వేశారు. బీజేపి, బీఆర్ఎస్ ల మధ్య జరిగిన మంతనాలు సయోధ్య కుదరలేదని తెలు స్తోంది.
క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
కోల్ బెల్ట్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సుమారు రెండు గంటలు సేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉదయం 10.30గంటలు కు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిన కౌన్సిలర్లు..12.00 గంటల వరకు కూడా ఎవరు రాలేదు. దీంతో కోరం లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహసీల్దార్, ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.
వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే :
1. ఇల్లందు
2. సుల్తానాబాద్
3. ఇబ్రహీంపట్నం
4. కాగజ్ నగర్
5. క్యాతనపల్లి
6. ఖానాపూర్
7. జహీరాబాద్
8. ఇంద్రేశం
9. దోర్నకల్
10. జనగాం
11. తొర్రురూ
