నంద్యాలలో అల్లు అర్జున్ ర్యాలీ..ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

నంద్యాలలో అల్లు అర్జున్ ర్యాలీ..ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

ఏపీ నంద్యాలలో  వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా తీసిన ర్యాలీ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు.  ర్యాలీ పై ముందస్తు సమాచారం ఉన్నా.. ఇవ్వలేదనే ఆరోపణలతో టూటౌన్ ఎస్బి హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్ ,తాలూకా ఎస్బి కానిస్టేబుల్ నాగరాజులను  వీఆర్ కు బదిలీ చేశారు.

మే 11న నంద్యాల వచ్చిన అల్లు అర్జున్.. తన  ఫ్రెండ్,   నంద్యాల వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ కు మద్దతుగా పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందును ర్యాలీలకు అనుమతి లేదు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా.. అల్లు అర్జున్, రవిలపై కేసు నమోదు చేశారు.   జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.  వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని సూచించింది ఈసి.