పాల్వంచ,వెలుగు : పట్టణంలోని కరకవాగులో గల ఫిల్టర్ బెడ్ రిపేర్ల నేపథ్యంలో మున్సిపాలిటీలో రెండు రోజులపాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డాకూ నాయక్ గురువారం విలేకరులకు తెలిపారు.
శుక్ర,శని వారాల్లో ఫిల్టర్ బెడ్ క్లారిఫైయర్ పంపులు శుభ్రపరచనున్నందున తాగునీటి సరఫరా అంతరాయానికి ప్రజలు సహకరిం చాలని కోరారు. ఈనెల 25న నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.