క్వారంటైన్‌ నుండి పారిపోయన 200 మంది బ్రిటన్‌ టూరిస్టులు

క్వారంటైన్‌ నుండి పారిపోయన 200 మంది బ్రిటన్‌ టూరిస్టులు
నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు తరలించిన రెండు వందల మంది బ్రిటన్‌ టూరిస్టులు హోటల్ నుండి పారిపోయారు.ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో జరిగింది. బ్రిటన్‌లో ఇటీవల గుర్తించిన నూతన కరోనా స్ట్రెయిన్‌తో పలు దేశాలు  అలర్టైయ్యాయి. ఇప్పటికే బ్రిటన్‌ నుండి వచ్చే విమానాలపై పలు దేశాలు నిషేధం విధించడంతో పాటు అక్కడి నుండి వచ్చిన పర్యాటకులను క్వారైంటన్‌కు తరలిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం కూడా బ్రిటన్‌ టూరిస్టులను 10రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో ఆల్పైన్‌ స్టేషన్‌కు చేరుకున్న 420 మందిలో 200 మంది బ్రిటన్‌ పర్యాటకులను ప్రభుత్వం స్విస్‌ కీ రిసార్ట్‌కు క్వారంటైన్‌కు పంపింది. వీరంతా అక్కడి నుండి పారిపోయినట్లు సోన్‌టాగ్స్‌ జీటింగ్‌ న్యూస్ పేపర్ తెలిపింది. కొంతమంది టూరిస్టులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోగా, మిగిలిన వారిపై నిర్బంధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులకు పంపిన భోజనం అలాగే ఉండిపోవడంతో.. హోటల్‌ నుండి వారు పారిపోయినట్లు గుర్తించినట్లు తెలిపింది. కొత్త కరోనా స్ట్రెయిన్‌ రెండు కేసులను స్ట్టిట్జర్లాండ్‌లో, పొరుగునే ఉన్న లీచ్టెన్స్టెయిన్‌లో ఒక కేసును గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.