సౌదీ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలి.. ఒక ఫ్యామిలీ నుంచి ఏడుగురు.. మరో కుటుంబం నుంచి 8 మంది..

సౌదీ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలి.. ఒక ఫ్యామిలీ నుంచి ఏడుగురు.. మరో కుటుంబం నుంచి 8 మంది..

సౌదీ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోల విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాలు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రా యాత్రకు వెళ్లి మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో 2025 నవంబర్ 17 తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలయ్యాయి. రెండు కుటుంబాలకు చెందిన 15 మంది చనిపోగా.. ఒకే ఒక్కడు బతికి బైట పడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మందిలో ప్రాణాలతో బయటపడ్డాడు షోయబ్ అనే యువకుడు. తీవ్రంగా గాయపడిన షోయబ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. 

షోయబ్ కుటుంబ సభ్యుల వివరాలు:

 మహమ్మద్ అబ్దుల్ కధీర్ (షోయబ్ తండ్రి, గౌసియా బేగం (షోయబ్ తల్లి) తోపాటు బంధువులు మహమ్మద్ మౌలానా (గౌసియా తండ్రి, షోయబ్ తాత),  రహీమ్ ఉనిషా,  రెహమత్ బి,  మహమ్మద్ మన్సూర్ చనిపోయారు. వీరితో పాటు మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. 

ముఫ్టీ ఆసిఫ్ ఉల్లా కుటుంబానికి చెందిన వారి వివరాలు:

మహమ్మద్ అలీ, సేహనాధ్ బేగం, మస్తాన్, జకీయ బేగం,  మహమ్మద్ సోయాబ్, పర్వీన్ బేగం, మొహమ్మద్ సోహెల్.

సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు బోరబండ ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు.  రహమద్బి, రహీం ఉన్నిసా బోరబండకు చెందిన వారిగా గుర్తించారు. అదే విధంగా ముసరంబాగ్ కు చెందిన అమీనా బేగం, హనీష్ ఫాతిమా కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు.