అమెరికాలో మంటల్లో కాలిపోయిన ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు

అమెరికాలో మంటల్లో కాలిపోయిన ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు

బర్మింగ్‌‌హామ్‌‌: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  బర్మింగ్‌‌హామ్‌‌లోని  ఓ అపార్ట్‌‌మెంట్ కాంప్లెక్స్‌‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు హైదరాబాద్ స్టూడెంట్లు చనిపోయారు. అపార్ట్‌‌మెంట్ కాంప్లెక్స్‌‌లో  తెలంగాణ, ఏపీకి చెందిన 10 మంది తెలుగు విద్యార్థులు ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. వారంతా అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నారని చెప్పారు. 

అగ్నిప్రమాదం జరిగిప్పుడు విద్యార్థులంతా తమ రూమ్ లోనే ఉన్నారని వెల్లడించారు. పొగ ఎక్కువ కావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేకపోయారని.. భయంతో అరుస్తూ సాయం కోసం కేకలు వేశారనన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. ఇంట్లో చిక్కుకుపోయిన మొత్తం 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారని వివరించారు. 

అందులో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనందున వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ హైదరాబాద్‌‌కు చెందిన ఉడుముల శాహజా రెడ్డి, కూకట్‌‌పల్లి ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.