
“ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంతవారలైనా కాంత దాసులే” అని ఏనాడో వాగ్గేయకారులు త్యాగయ్య చెప్పారు. ఇది మనుషులకే కాదు మృగరాజులకైనా వర్తిస్తుందని ఈ వీడియో చూశాక అనిపించకమానదు. ఓ ఆడ సింహం కోసం రెండు మగ సింహాలు హోరాహోరీ తలపడ్డాయి. పైచేయి నీదా.. నాదా అన్నట్టుగా పోరాడాయి. చివరికి ఓ సింహం తోక ముడిచింది. విజయం సాధించిన సింహం ఠీవీగా దాని జంట వైపు వెళ్లింది. ఐఏఎఫ్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘కింగ్ వర్సెస్ కింగ్, ఓన్లీ ఫర్ ఏ క్వీన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. దీనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. వీడియోను షేర్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 10 వేల మంది దీన్ని చూశారు. 650 మంది కాంమెంట్స్ చేయగా.. 100 మందికి పైగా రీట్వీట్ కొట్టారు.
King vs king??
Only for a queen…. pic.twitter.com/IKKjpxnbxv— Susanta Nanda IFS (@susantananda3) January 24, 2020
నిజమైన కింగ్‌దే విజయం
ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. ‘వావ్.. చివరికి నిజమైన కింగ్‌కు రాణి సొంతమైంది’ అంటూ ఒకరు స్పందించారు. ఆఫ్రికా ఎడారిలో జరిగినట్లుగా ఉందని మరో నెటిజన్ అన్నాడు. ఆ పోరాటం రాజ్యం కోసం అయ్యుండొచ్చు.. విజయం సాధిస్తే ఆటోమేటిక్‌గా రాణి సొంతమవుతుంది అని మరొకరు కామెంట్ చేశారు.