తెలంగాణలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. చేపల వేటకు వెళ్లి ఒకరు.. బావిలో పడి మరొకరు మృతి చెందారు. ఈ ఘటన రాజన్న, కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి దగ్గర మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పడి ఓ యువకుడు ప్రమాద వశాత్తు మరణించారు. చేపల వేటకు వెళ్లి బైరి దరి అనే యువకుడు చనిపోయాడు. అతనిది వేములవాడగా గుర్తించారు పోలీసులు. యువకుడు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని చనిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్ తో సహా బావిలో పడి అజయ్ అనే యువకుడు చనిపోయాడు. మృతుని స్వస్థలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కట్టారాంపూర్. కరీంపేటలో పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి:
పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hyderabad: వనస్థలిపురంలో భారీ చోరి
