పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ ఆ ప్రజాప్రతినిధులే దారి తప్పితే. ఇలాంటి ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.  పేకాట ఆడుతున్నారనే సమాచారంతో యాద్గార్ పల్లి గ్రామంలోని ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. అక్కడ ఉన్నవారిని చూసి అదుపులోకి తీసుకునే విచారిస్తే.. వారు ఎవరనే విషయం తెలిసింది. సిటీలోని జవహర్ నగర్ కార్పొరేషన్ కు చెందిన 3వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్, 4వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భర్త మారగోని వెంకటేశ్, 9వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భర్త  మనోదర్ రెడ్డిలు మరికొంతమందితో కలిసి పేకాట ఆడుతున్నారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ. 65,610 నగదు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు అధికారపార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఫోన్లు వస్తున్నట్లు సమాచారం.

For More News..

చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తు పొదుపు సాధ్యమే

భర్తను కాపాడబోయి భార్య కూడా మృతి

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఫిబ్రవరిలో థర్డ్ వేవ్