ఒమిక్రాన్ ఎఫెక్ట్: సెకండ్‌ వేవ్‌ కంటే భారీగా కేసులు వస్తయ్!

ఒమిక్రాన్ ఎఫెక్ట్: సెకండ్‌ వేవ్‌ కంటే భారీగా కేసులు వస్తయ్!

ఒమిక్రాన్ కారణంగానే ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది ఫిబ్రవరిలో పీక్స్ కు చేరే అవకాశముందని కోవిడ్ సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకటించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే... థర్డ్ వేవ్ తక్కువ తీవ్రతతో ఉంటుందని తెలిపింది. 2022 ప్రారంభంలోనే థర్డ్ వేవ్ మొదలవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు  ప్యానెల్ వివరించింది. దేశంలో పెద్ద స్థాయిలో ఇమ్యూనిటీ పెరిగినందున.. థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే థర్డ్ వేవ్ అనివార్యమని అని స్పష్టం చేసింది. కానీ కేసుల సంఖ్య సెకండ్ వేవ్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పింది.