
విద్యుత్ పొదుపు అనేది సామజిక బాధ్యత కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అని గవర్నర్ తమిళ సై అన్నారు. అవసరానికి మించి విద్యుత్ వినియోగం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో పాటు భూతాపం పెరుగుతుందని ఆమె హెచ్చరించారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో హైటెక్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (TSECA) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ హాజరయ్యారు.
‘ఇవాళ్టి వేస్టెజ్ రేపటి షార్టెజ్ అవుతుంది. ఇంధన పొదుపుపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్టం దేశానికి ఒక రోల్ మోడల్. ఇండియా... ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ. వినియోగదారులు చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తు పొదుపు సాధ్యమే. విద్యుత్ పొదుపుతోనే ఇంధనం ఆదా అవుతుంది. వినియోగదారులు తక్కువ కరెంటు తీసుకునే ఎల్‌ఈడీ బల్బులను వినియోగించుకోవాలి. నేటి సంకల్పం రేపటి వెలుగుల సహకారం అవుతుంది. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. విద్యుత్తు వృథాను నివారించటం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి. చిన్న నిర్లక్ష్యాల కారణంగా ఎక్కువగా విద్యుత్తు వృథా అవుతుంటుంది. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన వాడకాన్ని తగ్గించాలి’ అని తమిళి సై అన్నారు.
అనంతరం తెలంగాణ స్టేట్ ఎనర్జి కన్జర్వేషన్ తరపున గవర్నర్ పలువురికి అవార్డ్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ రెడ్కో ఛైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీమ్, ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ సునీల్ శర్మ, టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావ్, టీఎస్ రెడ్కో వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్యలు పాల్గొన్నారు.
For More News..