
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (AOB)లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు ఒడిశా డీజీపీ అభయ్ తెలిపారు. చనిపోయిన వారిలో ఏరియా కార్యదర్శి అనిల్ తోపాటు.. మావోయిస్టు ప్రముఖ నాయకురాలు అరుణక్క బాడీగార్డ్ మృతి చెందారని తెలిపారు. మావోయిస్టులు లంగిపోతే పునరావాసం కల్పిస్తామని డీజీపీ చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో రెండు రైఫిళ్లు, ఆరు మ్యాగజైన్లు, 59 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.