వీళ్ల పిచ్చికి హద్దు లేదా.. రైళ్లపై రీల్స్ కోసం స్టంట్స్

వీళ్ల పిచ్చికి హద్దు లేదా.. రైళ్లపై రీల్స్ కోసం స్టంట్స్

పాపులారిటీ కోసమో సరదా కోసమో మరో కారణమో తెలియదు కానీ.. కొంతమంది యువకులు చేసిన పని ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వాళ్లకు పిచ్చి కానీ పట్టిందా అనే అనుమానాలు కలగక మానవు.రన్నింగ్ ట్రైన్ లో వాళ్లు చేసిన ప్రమాదకర విన్యాసాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు.  ఇప్పుడు కదులుతున్న  రైలులో ఇద్దరు యువకులు   ప్రమాదకర రీల్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

వివరాల్లోకి వెళ్తే...

గ్రేటర్ నోయిడాలో  కదిలే గూడ్స్ ట్రైన్ లో ఇద్దరు యువకులు ప్రమాదకర రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో రన్నింగ్ గూడ్స్ ట్రైన్ రెండు బోగీలపై ఒకదానిపై ఒకకాలు.. మరొక దానిపై మరోకాలు పెట్టి ఫోజులిస్తూ నిలబడ్డారు.  వీరు కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి ... చొక్కా లేకుండా బాడీని  ప్రదర్శిస్తూ...  అంత బాడీ తమకే ఉందని ప్రదర్శించారు. రెండు బోగీల చివరన కాళ్లు పెట్టి నిల్చున్నారు. ఈ వీడియో  గౌతమ్ బుద్ధ నగర్ జర్చా గ్రామంలోని ఎన్టీపీసీ ప్లాంట్ దగ్గర  చిత్రీకరించినట్లు తెలిసింది.  అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు  ఎలాంటి పోలీసు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. 

రూల్స్ అతిక్రమణ

మన దేశంలో స్వేచ్ఛ ఎక్కువే. ఈ మధ్య యూత్ కొందరు రూల్స్ ఇష్టమొచ్చినట్లు అతిక్రమిస్తారు. ప్రాణాలకు తెగించి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలూ తీసుకోరు. చుట్టూ ఉన్న వారంతా తమనే చూస్తున్నారనీ... వాళ్లను ఆశ్చర్యపరచాలనే మెంటాలిటీ వారిలో ఉంటుంది.  అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతుంటాయి. తాజాగా ఓ రన్నింగ్  ట్రైన్ వీడియో లో ఇద్దరు యువకులు చేసిన విన్యాసాలు షాక్ తెప్పిస్తున్నాయి.

సినిమాల్లో మాదిరిగా 

సినిమాల్లో హీరోలు సాహసాలు  చేసినట్లు చూపిస్తారు. నిజానికి చాలా సీన్లలో వాటిని చేసేది డూప్‌లు. అవి చేసేందుకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నవారు ఉంటారు. గ్రాఫిక్స్ ద్వారా హీరోలే అవి చేసినట్లుగా చూపిస్తారు. అంతేకాదు... ఆ స్టంట్లు చేసేటప్పుడు హాని జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. కొంత మంది యువత ఆ హీరోలను ప్రేరణగా తీసుకొని కంట్రోల్ లేకుండా రెచ్చిపోతుంటారు. డేంజరస్ స్టంట్లు చేస్తుంటారు. ఎక్కడైనా తేడా వస్తే... ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి తమ తోటి వారి ప్రాణాలకూ ముప్పు కలుగుతుంది. ఆకతాయిలు మాత్రం ఇలా చేయడమే హీరోయిజం  అనుకుంటారు. సినిమా వేరు నిజ జీవితం వేరు అనే సత్యాన్ని వారు గ్రహించరు.ఈఇప్పటికీ ఇలాంటి స్టంట్లు చేస్తున్న వీడియోలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇలా ఎవరూ చేయవద్దని నెటిజన్లు కోరుతున్నారు.

https://twitter.com/imrajni_singh/status/1671840144129654786