
హైదరాబాద్ : అప్పుడే పుట్టిన అభంశుభం తెలియని పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చంపాలనుకున్నారు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ ఓ ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో గురువారం జరిగింది.
వివరాలు : ఇద్దరు దుండగులు అప్పుడే పుట్టిన పసికందును అంతమొందించాలని చూశారు. చిన్నారిని దుండగుడు ఆటోలొ JBS సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు. గోతితీసి చిన్నారిని పాతిపెట్టాలని చూశారు. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతన్ని నిలదీశారు.
తమ మనుమరాలు చనిపోవడంతో వాహనాల్లో ఎవ్వరు కూడా ఎక్కించుకోవడం లేదనీ, దీంతో ఇక్కడే శిశువును పూడ్చి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. అయితే శిశువు మాత్రం బతికే ఉంది. శ్వాస, కదలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఆడబిడ్డ అయినందునే వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు తెలిపారు. చిన్నారిని ట్రీట్ మెంట్ కోసం గాంధీ హస్పిటల్ కి తరలించారు.