అడవి జంతువుల పేర్లతో.. ఊరపంది మాంసం అమ్ముతున్రు

అడవి జంతువుల పేర్లతో.. ఊరపంది మాంసం అమ్ముతున్రు

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

పెద్దపల్లి టౌన్, వెలుగు: ఊర పంది మాంసాన్ని జింక, దుప్పి, అడవి పంది మాంసంగా నమ్మించి అమ్ముతున్న ముఠాలో ఇద్దరిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి సీఐ ప్రదీప్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లికి చెందిన పలువురు వన్య మృగాల మాంసంగా నమ్మించి ఊర పంది మాంసాన్ని అమ్ముతున్నారనే సమాచారంతో  పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో లోకిని అంజయ్య, రేవెల్లి సంపత్ అనే ఇద్దరు మాంసం అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. వీరు జింక, దుప్పి, అడవి పందులను వేటాడి చంపినట్లుగా ఫోటోలను చూపించి ప్రజలను నమ్మిస్తున్నారు. ఊర పంది మాంసాన్ని వారికి అధిక ధరలకు అమ్ముతున్నారు. నిందితుల నుంచి 20 కిలోల ఊర పంది మాంసం, 4 కత్తులు, బైక్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మరో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.