
హైదరాబాద్: లాక్ డౌన్ వేళ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు . నగరంలోని ECIL మహేశ్ నగర్ కాలనీ లో ఉన్న తేజ వైన్ షాప్ యజమాని సిద్ది రాములు గౌడ్ సూచన మేరకు .. ఆ షాప్ లో క్యాషియర్ గా పనిచేసే చిమ్ముల వాసు రెడ్డి మరియు అతని స్నేహితుడు చేరుకుపల్లి లింగా రెడ్డి అక్రమంగా మద్యం తరలించేందుకు ప్రయత్నించారు. ఇద్దరు కలిసి వైన్ షాప్ కు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వేసిన సీలును తొలగించి, అక్రమముగా షాప్ లోనికి ప్రవేశించి అందులోని మద్యం సీసాలను తమ కారులో లోడ్ చేస్తుండగా ,పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి, వారిద్దరిని పట్టుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.
లాక్ డౌన్ కారణంగా లిక్కర్ ను ఎక్కువ రేట్ కు అమ్ముకోవాలన్న ఉద్దేశంతో వారు ఈ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. షాప్ యజమాని, క్యాషియర్ మరియు అతని స్నేహితుడిపై పోలీసులు సెక్షన్ 448, 427, 188 ఐపిడసి మరియు సెక్షన్ 34-A AP ఎక్సైజ్ నందు కేసు నమోదు చేసుకొన్నారు. వైన్ షాప్ యజమాని సిద్ది రాములు గౌడ్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన కారుతో పాటు 41 MC DOWELS 750 ఎం.ఎల్ సీసాలు, 18 రాయల్ స్టాగ్ 750 ఎం.ఎల్ సీసాలను పోలీసులు సీజ్ చేశారు.