మల్లారెడ్డి కాన్వాయ్పై దాడి.. రేవంత్ అనుచరులపై కేసు

మల్లారెడ్డి కాన్వాయ్పై దాడి..  రేవంత్ అనుచరులపై కేసు

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై ఆదివారం రాత్రి  జరిగిన దాడి ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.  సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి లను ప్రధాన నిందితులుగా  గుర్తించారు. వారిపై  341, 352, 504, 506, 147, 144 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ ఇద్దరు రేవంత్ రెడ్డి అనుచరులని గుర్తించారు.  ‘మల్లారెడ్డి డౌన్ డౌన్’అంటూ నినాదాలు చేస్తూ.. వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరిన వారిలో వీరిద్దరు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వీరిద్దరి తో పాటు మరికొంతమంది కూడా దాడి ఘటనలో పాల్గొన్నారని చెప్పారు. 

ఆదివారం రాత్రి ఏం జరిగిందంటే.. 

ఆదివారం రాత్రి రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ వద్ద రెడ్ల సింహగర్జన సభ  జరిగింది. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ సమావేశం జరిగింది.  తన ప్రసంగంలో పదేపదే సీఎం కేసీఆర్‌‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి మల్లారెడ్డి పొగిడారు. దీంతో మీటింగ్‌కు హాజరైన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏమైందంటూ ప్రశ్నించారు. ‘సీఎం దృష్టికి తీసుకెళ్తా.. కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తా’ అని ఆయన చెప్పడంతో ఇంకెన్నాళ్లు మాటలతో మభ్యపెడతారంటూ జనం ఊగిపోయారు. మల్లారెడ్డిని మాట్లాడనివ్వలేదు. దీంతో ‘ఇది రెడ్ల చిల్లర ప్రయత్నం’ అని ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అనడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో మల్లారెడ్డి టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మధ్యలోనే ప్రసంగం ఆపేసి మల్లారెడ్డి వెళ్లిపోయారు. మంత్రి కాన్వాయ్‌ వెంట పడిన యువత.. కారుపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు ఆయన్ను భారీ భద్రత మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు..

మల్లారెడ్డికి నిరసన సెగ

సివిల్స్ లో మెరిసిన తెలుగుతేజాలు