ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా డైవర్ట్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా డైవర్ట్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్న పాతబస్తీకి చెందిన ఇద్దరు వ్యక్తులను ఫలక్ నుమ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలోని కాలపత్తర్ ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్, యూసుఫ్ హసన్ లు ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా డైవర్ట్ చేస్తూ, దేశ భద్రతకు ముప్పు కలుగజేస్తున్నారనే ఫిర్యాదుతో పోలీసులు వారిని పట్టుకున్నారు. గత ఆరేళ్ల నుంచి చైనా నుంచి సిమ్ కార్డులు, వాటికి సంబంధించిన బాక్సులు, డివైస్ లు దిగుమతి చేసుకొని వారు ఈ అక్రమాలకి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

పాతబస్తీలో 2 కేంద్రాలపై దాడి చేసి ఒక లాప్ టాప్ ,8 సిమ్ బాక్స్ లు, కాల్ డైవర్టింగ్ కిట్, ఒక కార్, 3 సెల్ ఫోన్ లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం, సెక్యురిటి వింగ్ టెలికాం డిపార్ట్ మెంట్ వారి ఫిర్యాదుతో ఫలక్ నుమ పోలీసులు, దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు చేసి నిందితులని అరెస్ట్ చేశారు.

two-persons-from-old-city-arrest-by-falaknuma-police-in-hyderabad