
చెన్నై : తమిళనాడులో సంక్రాంతి సందర్భం గా బుధవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లా మదురై ఏరియాలోని సిరవాయల్‌లో జరిగిన పోటీలో ఎద్దుల మధ్య నలిగి ఓ మైనర్ సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ జల్లికట్టు పోటీలో 186 ఎద్దులు పాల్గొన్నాయని పోలీసులు తెలిపారు.
మంజువిరాట్టు(ఎద్దును వెంబడించడం) వేదిక వద్ద ఎద్దులు దాడి చేయడంతో బాలుడు(11), యువకుడు(30) తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని పేర్కొన్నారు. సంకాంత్రి పండుగకు జల్లికట్టు నిర్వహించడం తమిళనాడులో ఆనవాయితీ. ఈ పోటీల ను చూసేందుకు దేశవిదేశాల నుంచి జనం తరలివస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి వాటిని లొంగదీసుకోవడం ఈ క్రీడలోని ప్రధానమైన అంశం.