కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రేపే(ఏప్రిల్ 9న) పోలింగ్‌‌‌‌‌‌‌‌

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రేపే(ఏప్రిల్ 9న) పోలింగ్‌‌‌‌‌‌‌‌
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ
  •     సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్​పై నిషేధం

న్యూఢిల్లీ, వెలుగు: కేరళ, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచార రథాలు మూగబోయాయి. కాగా, ఈ  మూడు రాష్ట్రాల్లో ఈ నెల 9న (గురువారం) పోలింగ్ జరగనుంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 30,471 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు గాను 31,486, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 ప్రకారం.. ఎనికల ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, ప్రచారాలు చేయడం నిషేధమని ఎన్నికల సంఘం తెలిపింది. 

అలాగే, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఎన్నికలకు సంబంధించిన కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రసారం చేయకూడదని పేర్కొంది. అంతేకాకుండా, బల్క్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫోన్ కాల్స్, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఓట్ల కోసం అభ్యర్థించడం నేరమని తెలిపింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల వాతావరణాన్ని నిర్వహించేందుకు ఈ నిబంధనలను అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. అలాగే, గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్​పై ఎన్నికల  సంఘం నిషేధం విధించింది. తమిళనాడులో ఈ నెల 23న, పశ్చిమ బెంగాల్ లో 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. వీటితో పాటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.