చందానగర్ లో ఇద్దరు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చందానగర్ లో  ఇద్దరు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చందానగర్, వెలుగు: స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్నామని చెప్పి ఇద్దరు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాము ఉంటున్న చిల్డ్రన్​ హోం నుంచి బయటకు వెళ్లి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా సంఘటన చందానగర్​ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిట్స్​లో చోటుచేసుకుంది. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..   లింగంపల్లి ఎంఐజీ కాలనీలో  ఎస్​ఓఎస్​ చిల్ర్డన్​ యూత్​ హౌస్​ ఉంది.  ఇందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తారు.  ఇదే హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న యు. రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17),  జగన్​(14)  బీహెచ్​ఈఎల్​ ప్రభుత్వ పాఠశాలలో  9, 8 తరగతులు చదువుతున్నారు.  ఈ  నెల 13న ఇద్దరు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్నామని 8.30 గంటలకు హౌస్​ నుంచి బయటకు వచ్చారు.

తిరిగి సాయంత్రం  రాలేదు.    స్థానికంగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.  స్కూల్​ పిల్లలను ఆరా తీయగా, 13వ తేదీన రాజేశ్​, జగన్​ స్కూల్​కు రాలేదని తెలిపారు.   అదే రోజు ఉదయం ఇద్దరు కలిసి గుర్తు తెలియని వ్యక్తులను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ మేరకు చందానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.