సూర్యపేటలో ఇద్దరు తహసీల్దార్లపై వేటు

సూర్యపేటలో ఇద్దరు తహసీల్దార్లపై వేటు

సుర్యాపేట జిల్లాలో  ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టిన ఇద్దరు తహసీల్దార్లపై వేటు పడింది. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 540 లో ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టాలు చేశారని ఇద్దరు తహసిల్దార్లను సస్పెండ్ చేస్తూ జిలా కలెక్టర్  టి.వినయ్ కృష్ణారెడ్డి ఉత్వర్లు జారీ చేశారు. ప్రస్తుతం మఠంపల్లి తాహసిల్దార్ గా ఉన్న వేణుగోపాల్, గరిడేపల్లి తాహసిల్దార్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ లను సస్పెండ్ చేశారు కలెక్టర్. 430 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మ్యూటేషన్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు.

52 ఎకరాలు స్థానికులకు అక్రమంగా పట్టాలు ఇచ్చారు తహసీల్దార్ వేణుగోపాల్. 369 ఎకరాల భూమిని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేశారు మరో తహసీల్దార్ చంద్రశేఖర్. మొత్తం 540 సర్వేనెంబర్ లో 6వేల ఎకరాల భూమికి గాను 12 వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చింది రెవెన్యూ యంత్రాంగం. వీటిపై అధికార యంత్రాంగం విచారణ  జరుపుతుంది. ఈ తతాంగంలో మరి కొంత మంది రెవెన్యూ అధికారులపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది.

seee more news

29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు