అమెరికాలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ విద్యార్థులు

అమెరికాలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ విద్యార్థులు

అమెరికాలో ఘోరం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ ఆగస్టు నెలలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చికాగోలోని సెయింట్ లూయిస్ కాలేజీలో ఎంఎస్ చేస్తున్నాడు.

ఆదివారం ఉత్తేజ్ తన ఫ్రెండ్ శివదత్తతో కలిసి ల్యాండర్ వ్యాలీ లేక్ లో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ చెరువులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కుమారుల మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.