డోపీగా తేలిన ఇండియా బాస్కెట్‌బాల్ స్టార్ సత్నామ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (ఎన్‌బీఏ)లో చోటు దక్కించుకున్న ఇండియన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన సత్నామ్ సింగ్ భమారాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డిసిప్లినరీ ప్యానెల్ గురువారం రెండేళ్ల బ్యాన్ విధించింది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన టెస్టుల్లో సత్నామ్ ఫెయిలవడంతో నాడా అప్పుడే ప్రొవిజినల్ సస్పెన్షన్ విధించింది. అయితే, భమారా దీన్ని సవాల్ చేశాడు. దీనిపై యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ (ఏడీడీపీ)తో విచారణ చేపట్టింది. నిషేధిత ‘హిగెనమైన్’ అనే డ్రగ్‌ను సత్నామ్ ఉపయోగించినట్టు తేలవడంతో అతనిపై రెండేళ్ల వేటు వేసింది.

