చోరీలు ఇంటి నుంచే మొదలెట్టాడు

చోరీలు ఇంటి నుంచే మొదలెట్టాడు
  • దొంగతనాలు చేస్తున్న యువకుడి అరెస్ట్‌
  • ఫోన్లు ఎత్తు కెళ్లి ఓఎల్‌ ఎక్స్‌ లో అమ్ముతున్న మరొకరు కూడా

దిల్ సుఖ్ నగర్, వెలుగు: జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గురువారం సరూర్ నగర్ సీసీఎస్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీఎస్ ఎల్బీనగర్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…సూర్యపేట జిల్లా కోదాడ కు చెందిన కోయిల కొండ రాధాకల్యాణ్ (21) జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడడంతో పాటు తన ఇంట్లోనే 14 తులాల బంగారం చోరీచేశాడు,2014 లో పలు కేసులలో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ అదే తరహాలో దొంగతనాలు మొదలుపెట్టాడు. హయత్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి,ఉప్పల్, మీర్ పేట పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ఇళ్లలో జరిగిన చోరీల వద్ద సేకరించిన వేలిముద్రల ఆధారంగా ఇతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

మరో కేసులో…

వికారాబాద్ రాజీవ్ గృహ కల్ప కాలనీకి చెందిన సుర్మిళ్ల అరుణోదయ రాజ్(33)అలియాస్ పింటూ అనే వ్యక్తి అమెజాన్ లో సూపర్ వైజర్ గాపని చేసే వాడు. ఇతడు తన స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఖర్చుల కోసం చోరీలకు పాల్పడేవాడు.మొబైల్ ఫోన్లు,బంగారు ఆభరణాలు దొంగలిస్తూ గతంలో వికారాబాద్, ముషీరాబాద్ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. మళ్లీ గంజాయి స్మగ్లింగ్ కేసులో వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు పంపారు. తిరిగి జైలు నుంచి బయటకు వచ్చి హయత్ నగర్, ఉప్పల్, మీర్ పేట,చైతన్య పురి,సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డా డు.దొంగిలించిన మొబైల్ ఫోన్లను olx లో సేల్ చేస్తున్నట్లు గుర్తించి రికవరీ చేశారు.ఇతడి నుంచి 1 లక్షా 50 వేల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు . వీరిని సీపీ ప్రత్యక్ష పర్యవేక్షణ లో జాయింట్ సీపీ సుధీర్ బాబు మార్గదర్శనంలో ఓ ఎస్ డీ క్రైమ్స్ శ్రీనివాస్ ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్​ చేశారు.వీరి నుంచి మొత్తం గా 9 కేసులకు సంబంధించి 13 తులాల బంగారం,16 తులాల వెండి ఆభరణాలు,30 మొబైల్ ఫోన్లు,2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు .వాటి విలువ దాదాపు 9 లక్షల రూపాయలు ఉంటుందని ఓ ఎస్ డీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపారు.