
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్వాల్ గూడలోని క్రషర్ క్వారీ దగ్గర నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజేంద్రనగర్ శివరాం పల్లికి చేందిన మల్లేష్ (24), జయకృష్ణ (25) అనే ఇద్దరు యువకులు క్వారీలో పనికోసం వచ్చారు. అయితే నీటి గుంట దగ్గర సీనరీ బాగుందని ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత నీటి గుంటలో కాళ్లు కడుక్కుంటుండగా.. కాలు జారీ ఇద్దరూ నీటి గుంటలో పడి గల్లంతయ్యారు. క్వారీలో పనిచేస్తున్న మిగిలిన కార్మికుల ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాల కోసం గజఈతగాళ్లతో వెతికిస్తున్నారు.
For More News..