ఉబర్ విలువ ఐదున్నర లక్షల కోట్లు

ఉబర్ విలువ ఐదున్నర లక్షల కోట్లు
  • ఐపీవో ద్వారా దాదాపు 10 బిలియన్ డాలర్లు సేకరించాలని యోచన
  • అమెరికా ఎక్స్చేంజ్ ఇదే తొమ్మిదో అతిపెద్ద ఆఫర్
  • భారీ మొత్తంతో లిస్ట్ అవుతోన్న టెక్నాలజీ సంస్థలు

వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ ఇంక్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ విలువ 80 బిలియన్ డాలర్ల నుంచి 90బిలియన్ డాలర్లుగా లెక్కకట్టింది. అంటే ఇండి యన్ కరెన్సీ ప్రకారం.. రూ.5,60,300 కోట్ల నుంచిరూ.6,30,337 కోట్లు. ఈ ఐపీఓ విలువ, చివరిసారి చేపట్టిన ప్రైవేట్ ఫండింగ్‌ కంటే కాస్త ఎక్కువగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్కోషేరును ఇన్వెస్టర్లకు 44 డాలర్ల నుంచి 50 డాలర్లధర శ్రేణిలో ఆఫర్ చేయాలని ఉబర్ యోచిస్తోందని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పా రు.

లిస్టింగ్ ద్వారా ఉబర్ 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇన్వెస్టర్ డిమాండ్ బట్టి ధర ఆధారపడి ఉంటుందని, తర్వాత షేరు ధర పెరగవచ్చని కూడా పేర్కొన్నారు. దీంతో ఉబర్ ఐపీఓ వాల్యుయేషన్ కూడా పెరగనుంది. ఉబర్ ఐపీఓ 120 బిలియన్ డాలర్లుగా ఉంటుందని గతేడాదే బ్యాంకర్స్‌‌‌‌‌‌‌‌ జాకియింగ్ చెప్పింది. ఈ ఐపీఓలో అతిపెద్ద ఇన్వెస్టర్లే పాల్గొనే అవకాశం ఉంటుంది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్‌‌‌‌‌‌‌‌ కూడా ఉబర్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా 50 కోట్ల డాలర్ల షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి వాల్‌‌‌‌‌‌‌‌స్ట్రీట్ జర్నల్‌‌‌‌‌‌‌‌కు చెప్పా రు.

ఇటీవల టెక్నాలజీ యూనికార్న్‌‌‌‌‌‌‌‌లు భారీ మొత్తంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్ అవుతున్నాయి. 20.5 బిలియన్ డాలర్ల విలువతో ఉబర్ ప్రత్యర్థి లిఫ్ట్ ఇంక్ మార్చిలో మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరైంది. కానీ అప్పటి నుంచి దాని షేర్‌‌‌‌‌‌‌‌, ఐపీఓ ధర కంటే 22 శాతం తక్కువకు పడిపోయింది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం16.1 బిలియన్ డాలర్లుగా ఉంది. డిజిటల్ ఇమేజ్ షేరింగ్ కంపెనీ పిన్ట్‌‌‌‌‌‌‌రె స్ట్‌‌‌‌‌‌‌‌ ఇంక్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ నెల 17న మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టింది. ఈ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్ ముగిసే నాటికి లిస్టింగ్‌ కంటే 52 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ15.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరవ్వడం కోసం అన్ని విధాలా సిద్ధంఅవుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

ఉబర్8 బిలియన్ డాలర్ల ఆఫరింగ్ అంటే… ప్రత్యర్థి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ 2.34 బిలియన్ డాలర్ల ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే మూడింతలుఎక్కువ. ఈ ఏడాది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లిస్టింగ్‌ లోఇప్పటిదాకా లిఫ్ట్ నిలిచింది. ఉబర్ కనుక 8 బిలియన్ డాలర్లతో లిస్టింగ్‌ కు వస్తే, అమెరికా ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌లోనే ఇది తొమ్మిదో అతిపెద్ద ఆఫర్ అవుతుంది. 2014లో25 బిలియన్ డాలర్ల లిస్టింగ్‌ తో అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ రికార్డు సృష్టించిం ది. పిన్ట్‌‌‌‌‌‌‌‌రెస్ట్,జూమ్ వీడియో కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ ఏడాది పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ఇష్యూలకు వెళ్లా లనుకుంటున్న హై ప్రొఫైల్ స్టార్టప్‌ లు స్లాక్ టెక్నాలజీస్ ఇంక్, పోస్ట్‌‌‌‌‌‌‌‌మేట్స్ ఇంక్,ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎన్‌ బీ ఇంక్ ఉన్నాయి.