పనికి రాని దేశం అనుకున్నారు.. ఏకంగా టీ20 ప్రపంచ కప్‌‌కే అర్హత సాధించారు

పనికి రాని దేశం అనుకున్నారు.. ఏకంగా టీ20 ప్రపంచ కప్‌‌కే అర్హత సాధించారు

వెస్టిండీస్‌, యూఎస్‌ వేదికగా 2024లో టీ 20 ప్రపంచ కప్ జరగనుంది.  క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 20 జట్లతో ఈ పొట్టి సమరం జరగబోతుంది. జూన్ 3 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరగనుండగా నిన్నటివరకు 19 జట్లు అర్హత సాధించాయి. తాజాగా 20 జట్టుగా రువాండాపై విజయం సాధించిన ఉగాండా.. చరిత్ర సృష్టించింది. క్రికెట్ లో ఒక ఐసీసీ టోర్నీకి అర్హత సాధించడం ఉగాండా క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ఆ జట్టు సంబరాలు ఆకాశాన్ని దాటేశాయి. 

ఈ మ్యాచ్ లో ఉగాండాపై రువాండా గెలిస్తే జింబాబ్వే టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించేది. కానీ జింబాబ్వే ఊహించినదేమీ జరగలేదు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రువాండా కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో కేవలం 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసింది. ఆఫ్రికా క్వాలిఫయర్ లో భాగంగా మొత్తం ఆరు మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన ఉగాండా.. నమీబియా తర్వాత టీ 20 ప్రపంచ కప్ కు అర్హత సాధించిన రెండో  జట్టుగా నిలిచింది. రెండు రోజుల క్రితం 19 వ జట్టుగా నమీబియా అర్హత సాధించగా.. తాజాగా 20 జట్టుగా ఉగాండా నిలిచి వరల్డ్ కప్ జట్లేవో అనే సస్పెన్స్ కు తెరదించింది. 

20 జట్లు అయినప్పటికీ జింబాబ్వే, కెన్యా జట్లు అర్హత సాధించలేకపోవడం సంచలనంగా మారింది. ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించని ఆ జట్టు తాజాగా టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ కు అర్హత సాధించలేక ఇంటి ముఖం పట్టింది. సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే ప్రస్తుతం కెన్యాతో మ్యాచ్ ఆడుతోంది. 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసిన జింబాబ్వే విజయం దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టుకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఉగాండా, నమీబియా చేతిలో ఓడిపోవడం జింబాబ్వే అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
     

-వెస్టిండీస్,USA ఆతిథ్య దేశాలుగా అడుగుపెడతాయి. 
-ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,భారత్,నెదర్లాండ్స్,న్యూజిలాండ్, పాకిస్తాన్,దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో 
  టాప్-10లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా అర్హత సాధించాయి.
-స్కాట్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),ఐర్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),పాపువా న్యూ గినియా (తూర్పు-ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్)

 నేపాల్,ఒమన్,కెనడా,ఆఫ్రికా, నమీబియా, ఉగాండా క్వాలిఫైయర్ మ్యాచ్ ల ద్వారా అర్హత సాధించాయి.