సెప్టెంబర్ నుంచి అకడమిక్ ఇయర్.!

సెప్టెంబర్ నుంచి అకడమిక్ ఇయర్.!

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం వల్ల ప్రతి ఏటా జూలైలో మొదలయ్యే అకడమిక్ సెషన్లు ఈసారి సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. యూజీసీ నియమించిన ప్యానెల్ ఈ మేరకు సిఫార్సు చేసింది.విద్యా సంవత్సరంలో జాప్యం, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ తదితర సమస్యలను పరిశీలించాలని రెండు కమిటీలను యూజీసీ నియమించింది.వర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ఆల్టర్నెటివ్ అకడమిక్ క్యాలెండర్‌‌పై పరిశీలనకు హర్యానా యూనివర్శిటీ వైస్ చాన్స్‌‌లర్ ఆర్‌‌‌‌సీ కుహడ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని, ఆన్‌‌లైన్ ఎడ్యు కేషన్ అభివృద్ది చర్యలు సూచించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌‌లర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలోని మరొక కమిటీని నియమించింది. ఏటా జూలైలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్లను ఈ ఏడాదిసెప్టెంబర్ లో మొదలుపెట్టాలని ఓ ప్యానెల్రికమండ్ చేసింది. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వర్సిటీలు ఆన్‌‌లైన్లో ఎగ్జామ్స్ పెట్టాలని, లేదంటే లాక్‌‌డౌన్ ముగిశాక ఎగ్జామ్స్ పెట్టాలని రెండోప్యానెల్ రిపోర్టు ఇచ్చింది. వీటిని పరిశీలించి వచ్చే వారంలో అధికారిక గైడ్ లైన్స్ విడుదలచేస్తామని హెచ్‌‌ఆర్‌‌‌‌డీ మినిస్ట్రీ అధికారులుచెప్పారు.