రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్

రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ బార్బర్ షాపులో గడ్డం ట్రిమ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూపీలోని రాయ్ బరేలీలో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఆకస్మికంగా రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులోకి వెళ్లారు. మిథున్ కుమార్ అనే బార్బర్ కష్టసుఖాలను రాహుల్​ అడిగి తెలుసుకుంటూ గడ్డం ట్రిమ్ చేయించుకున్నారు.

తర్వాత అతనితో ఫొటో దిగారు. ‘‘ఎన్నికల ఏర్పాట్లు ముగిశాయి.. కానీ హెయిర్ కటింగ్ కూడా ముఖ్యమే..” అంటూ ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. రాహుల్ విజిట్ చేసిన తర్వాత మిథున్ షాపు పాపులర్ అయిపోయిందని, అతనికి గిరాకీ విపరీతంగా పెరిగిందంటూ పలువురు ట్వీట్ చేశారు.