ఓటీటీలోకి ఉగ్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ఉగ్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అల్లరి నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అల్లరి నరేష్ కంప్లీట్ మేకోవర్ అయ్యి పక్క మాస్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమాకు మంచి రిపోర్ట్స్ వచ్చాయి. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగుయడంతో.. ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమా జూన్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఓటీటీలో ఈ  సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నాంది లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల నుండి వచ్చిన సినిమా కావడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. దీంతో ప్రేక్షకుల నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. మరో థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో అలరించని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో చూడాలి మరి.