యూకేలో జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

యూకేలో జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ తో జూలై 17వ తేది వరకు లాక్‌డౌన్ పొడిగించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. పబ్‌లు, రెస్టారెంట్లు, షాపులను జులై 17వతేదీ వరకు మూసివేసే అధికారాన్ని కౌన్సిల్‌లకు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్షలో భాగంగా బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ నివేదిక సమర్పించారు. కరోనా ఇన్ఫెక్షన్ ను లాక్ డౌన్ ఆంక్షల అమలుతో నియంత్రించాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. గతవారంతో లాక్‌డౌన్‌ గడువు ముగియాల్సి ఉండగా మళ్లీ పొడగించారు. బ్రిటన్ కు వచ్చే విజిటర్స్ తప్పని సరిగా 10 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.