
మీరు చైనీస్ రెస్టారెంట్లలో శుష్టిగా లాగించేస్తున్నారా.. అయితే మీరు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆరగిస్తున్నారన్నమాట. అదెలా అనుకుంటున్నారా... అయితే ఈ వార్త చదవండి.. మీకే అర్దమవుతుంది. . .
రెస్టారెంట్లలో కష్టమర్లను ఆకర్షించడానికి వెరైటీ ఫుడ్లను అందుబాటులో ఉంచుతారు. ఒక్కోసారి వాటి పేర్లు కూడా వినం. కాని జిహ్వ చాపల్యం కదా.. తినాలనిపిస్తుంది. సూప్ లు.. కొత్త కొత్త వెరైటీలతో ప్రపంచ వ్యాప్తంగా చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాళ్లు ఎలా తయారు చేస్తారో కాని బాగా టేస్టీ ఉందనుకుంటారు జనాలు. అలానే యూకేలోని చైనీస్ రెస్టారెంట్ కి వెళ్లి మంచి ఫుడ్ తినాలనుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సూప్ ఆర్డర్ చేస్తే.. అందులో ఎలుక ఒకటి కనపడింది. అది చూసి షాకయిన కష్టమర్.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది అది కాస్త వైరల్ గా మారింది.
రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన వంటకాన్ని ఇంటికి తీసుకెళ్లాడో వ్యక్తి, తిందామని ప్లేట్‌లో వడ్డించుకోగా సూప్‌లో ఏదో వింత ఆకారంలో కదులుతున్నట్లు అనిపించింది. దానిని పరిశీలించగా ముందుగా తోక కనిపించింది. ఆ తర్వాత కనిపించింది చూసి దాదాపు గుండె ఆగినంత పనైంది. వేడివేడి సూప్‌లో ఊహించని రీతిలో కనిపించిన దానిని చూసి షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..
యూకేలోని కెంట్‌కు చెందిన సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ టేక్‌అవే రెస్టారెంట్‌కు వెళ్లి పుట్టగొడుగుల (మష్రూమ్) సూప్ ఆర్డర్ చేశాడు. అనంతరం పార్సిల్ తీసుకుని తన ఫ్రెండ్ ఇంటికి దానిని తీసుకుని వెళ్లాడు. రాత్రి భోజనం చెద్దామని ఫ్రెండ్‌తోపాటు కూర్చున్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు. ఇంతలో సామ్ హేవార్డ్ తన ముందు గిన్నెలో ఉన్న సూపులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏంటా అని చూస్తున్న హేవార్డ్‌కు ఓ తోక కనిపించింది. దానిని చూసిన అతను సూప్‌లో రెస్టారెంట్ చెఫ్ పెద్ద పుట్టగొడుగు వేసినట్లు ఉన్నాడని భావించాడు. కాసేపటికే దానిలో నుంచి చిట్టెలుక పైకి వచ్చింది. అప్పటికే మూడొంతులు సూప్ ను తినేశారు.ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన హేవార్డ్ వెంటనే తన ఫోన్ నుంచి సూప్‌లో కదులుతోన్న ఎలుకకు సంబంధించిన వీడియోను తీసి టేక్‌అవే ఆర్డర్ చేసిన రెస్టారెంట్‌కు ఫోన్ చేశాడు.
తాను తీసుకెళ్లిన సూప్ లో పెద్ద పుట్టగొడుగు లాంటి ఆకారం కనిపించింది. దానిని పరిశీలించగా ప్రాణాలతో ఉన్న ఓ జీవిగా గుర్తించాను. దీంతో నాకు చాలా భయం వేసింది. రెస్టారెంట్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేయగా తమకు ఎటువంటి బాధ్యత లేదని, వాపసు తీసుకోవడానికి నిరాకరించింది.హేవార్డ్ దానిని కొనుగోలు చేసినప్పుడు నగదు రూపంలో రెస్టారెంట్ బిల్లు చెల్లించలేదు. దీంతో ఎలాంటి రసీదు లేకపోవడంతో ఆ రెస్టారెంట్‌లోనే సూప్ కొనుగోలు చేశామనే విషయాన్ని రుజువు చేయలేకపోయామని వీడియోలో చెప్పుకొచ్చాడు.