యూకే వీసా ఫీజు పెంపు.. అక్టోబర్​ 4 నుంచి అమలు

యూకే వీసా ఫీజు పెంపు..  అక్టోబర్​ 4 నుంచి అమలు

లండన్ :  తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు, పర్యాటకులకు బ్రిటన్ ప్రభుత్వం వీసా ఫీజును పెంచింది. పెంచిన ఫీజులు అక్టోబర్​4 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. 6 నెలల విజిటింగ్​ వీసాపై 15 పౌండ్లు, అదేవిధంగా స్టూడెంట్లు 127 పౌండ్లు ప్రస్తుత ఫీజుకు అదనంగా చెల్లించాలి. 

 

Also Raed:ఈ చలికోటు రూ.9 కోట్లు.. దీని స్పెషల్ అదే

భారతీయులతో సహా అన్ని దేశాల పర్యాటకులకు ఈ నిబంధన వర్తించనుంది. ఈమేరకు శుక్రవారం యూకే హోం ఆఫీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. సవరించిన వీసా ఫీజుల ప్రకారం ఆరు నెలల్లోపు విజిట్​వీసా కోసం 115 బ్రిటన్​ పౌండ్లు చెల్లించాలి. బ్రిటనేతర స్టూడెంట్లు 490 పౌండ్లు స్టూడెంట్ వీసా కోసం చెల్లించాలి.