
బ్రిటన్ దివంగత యువరాణి డయానా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచింది. 42ఏళ్ల క్రితం ధరించిన డయానా రెడ్ స్వెటర్ రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది. బ్రిటన్ దివంగత యువరాణి డయానా ధరించిన తెల్ల గొర్రెల మధ్య నల్ల గొర్రె చిత్రాలు ఉన్న రెడ్ కలర్ స్వెటర్ కోట్లలో అమ్ముడుపోయింది. ప్రిన్సెస్ డయానా యొక్క ఈ బ్లాక్ షీప్ స్వెటర్ న్యూయార్క్‌లోని సోథెబైస్‌లో జరిగిన వేలంలో 1.1 మిలియన్ డాలర్లకు (రూ. 9 కోట్లకు పైగా) అమ్ముడైంది. Sotheby’s ఈ స్వెటర్ ధరను దీని కంటే చాలా తక్కువ ధరకు అమ్ముడుపోతుందని అంచనా వేసింది. ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన చారిత్రాత్మక బ్లాక్ షీప్ వార్మ్ & వండర్‌ఫుల్ స్వెటర్ ఫ్యాషన్ ఐకాన్ వేలంలో డాలర్ 1.1 మిలియన్లకు అమ్ముడయిందని వేలం హౌస్ ఒక ట్వీట్‌చేసింది.
1981లో ప్రిన్స్ చార్లెస్ పోలో మ్యాచ్‌కి డయానా ఈ స్వెటర్‌ను ధరించింది. ఆగస్ట్ 31న బిడ్డింగ్ ప్రారంభం కాగా, వేలం చివరి నిమిషం వరకు అత్యధికంగా 2 లక్షల డాలర్ల కంటే తక్కువ ధర పలికింది. సోథెబైస్ స్వెటర్ విలువ కేవలం50 నుంచి 80 వేల డాలర్ల మధ్యఉంటుందని అంచనా వేసారు. కానీ వారు అనుకున్నదానికంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. స్వెటర్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. యువరాణి డయానాకు సంబంధించి స్వెటర్ తోపాటు మరిన్ని ఇతర వస్తువులు వేలంలో ఉంచారు. అయితే ఈ స్వెటర్ మాత్రమే అత్యంత ఖరీదైనదిగా అమ్ముడుపోయింది.
యువరాణి డయానాకు (Princess Diana) సంబంధించి స్వెటర్ తోపాటు మరిన్ని ఇతర వస్తువులు వేలంలో ఉంచారు. అయితే ఈ స్వెటర్ మాత్రమే అత్యంత ఖరీదైనదిగా అమ్ముడుపోయింది. ఈ స్వెటర్ డిజైన్ తరచుగా రాజకుటుంబంలో డయానా స్థానానికి చిహ్నంగా కనిపిస్తుంది. కాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన యువరాణి డయానా అత్యంత ప్రసిద్ధ.. బాగా గుర్తుండిపోయే యువరాణి. ఫిబ్రవరి 24, 1981న, రాజ కుటుంబం 32 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. వారు ఐదు నెలల తర్వాత వివాహం చేసుకున్నారు. డయానా రాజకుటుంబం యొక్క విధానాలతో ఇమడలేకపోయింది. ప్రిన్స్ చార్లెస్ వ్యవహారాలు ఆమెకు అసౌకర్యాన్ని పెంచాయి. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవడానికి ఇదే కారణం. ఆగస్ట్ 31, 1997న ప్యారిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరాణి డయానా మరణించింది.
డయానా వస్తువు ఒకటి ఇంత ఖరీదైన ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె బాల్‌గౌన్‌లలో ఒకటి 5 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇప్పుడు డయానా స్వెటర్ అత్యంత ఖరీదైన స్వెటర్ వేలం రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికన్ గాయకుడు-కంపోజర్ కర్ట్ కోబెన్ స్వెటర్ రూ. 2 కోట్లకు విక్రయించబడింది. ఇప్పుడు డయానా స్వెట్టర్ కోబెన్ రికార్డును బద్దలు కొట్టింది.