నల్ల మొక్కజొన్న.. కాల్చితే కాదు.. దీని రంగే అది..

నల్ల మొక్కజొన్న.. కాల్చితే కాదు.. దీని రంగే అది..

రెండు చినుకులు పడ్డాయంటే వేడి వేడిగామొక్కజొన్న కంకులు తిన్నారా అంటే ఆ హాయే వేరుగా ఉంటుంది.  కొంతమంది మొక్కజొన్న కంకులను నిప్పులపై కాల్చుకొని తింటారు.  అప్పుడు అవి పచ్చగా ఉన్న గింజలు నల్లగా మారతాయి.  అయితే తాజాగా నల్ల మొక్కజొన్న పంట వెలుగులోకి వచ్చింది.  చాలా మందికి ఇలాంటి పంట ఉన్నదనే విషయం మాత్రం తెలియదు.  కాని ఇది వాస్తవం.  నల్ల మొక్కజొన్న కంకుల ( Block Corn) వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by lezzetalemi (@lezzet.alemi)

అయితే నల్లమొక్కజొన్న కంకులు.. పచ్చ కంకుల కంటే తక్కువ తీపిదనం కలిగి ఉన్నా.. టేస్ట్ మాత్రం అదిరిపోతుందట.  ప్రపంచంలో బ్లాక్ కార్న్ ను చాలా మంది తిన్నారు. ఇవి కాల్చకుండా ఉన్నప్పుడు వీటిరంగు సహజంగానల్ల రంగులో ఉంటుంది. కాని పచ్చ  మొక్క జొన్నలను కాల్చిన తరువాతే నల్లగా మారతాయి.  వీటి సాగు కూడా చాలా భిన్నంగా ఉంటుంది.   నల్ల మొక్కజొన్న ఆకులు లేత ఊదారంగులో ఉండి.. ఈ మొక్కలు మూడు మీటర్ల వరకు ఎత్తు వరకు ఎదుగుతాయి. దీనికి వచ్చే కంకులు 20 సెంటీమీటర్లు ఉంటాయి. ఇవి కోత దశకు వచ్చినప్పుడు గింజలు నల్ల రంగులోకిమారి.. వాటి నుంచి ఒక ద్రవం బయటకు వస్తుంది.   అయితే ఈ కంకుల ఆకులను తొలగించే టప్పుడు చేతి వేళ్లు ఊదా రంగులోకి మారతాయి.   వీటిని తినేటప్పుడు  పచ్చ మొక్కజొన్నలకంటే ఎక్కువుగా నమలాలి.  ఇందులో అదనంగా పిండి పదార్దాలు ఉంటాయి.

నల్లమొక్కజొన్న పంట కొన్ని ప్రాంతాల్లోనే పండుతుంది.  ఈ పంటను పెరూలో సాగు చేస్తారు. దీనిని  అక్కడ మెజ్ మొరాడో అంటారు.  యూఎస్.. యూకేలలో దీనిని బ్లాక్ మెక్సికన్ కార్న్ అని పిలుస్తారు.  దక్షిణ అమెరికా ప్రాంతంలో ఈ పంట అరుదుగా కనిపిస్తుంది.  ఈ పంటను వేడి వాతావరణంలో పండించాలి.