రష్యా ట్యాంకర్​పై డ్రోన్లతో ఉక్రెయిన్​ దాడి

రష్యా ట్యాంకర్​పై   డ్రోన్లతో ఉక్రెయిన్​ దాడి

కీవ్: రష్యా ట్యాంకర్​పై  ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. క్రిమియా సమీపంలోని నల్ల సముద్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ దాడికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.  శుక్రవారం ఒక్కరోజే ఉక్రెయిన్​ రెండుసార్లు దాడులు చేసింది. బ్లాక్​సీలో నావికా సామర్థ్యాన్ని పెంచుకున్న కీవ్​ ముందుగా రష్యా పోర్టుపై డ్రోన్లతో దాడికి పాల్పడింది. 

సుమారు మూడు వారాల క్రితం ఉక్రెయిన్​ పోర్టులపై రష్యా దాడి చేసింది. ప్రతిగా ఉక్రెయిన్​ నల్ల సముద్రంలోని రష్యా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఉక్రెయిన్​ డ్రోన్ల దాడితో తమ ట్యాంకర్​ఇంజిన్​రూమ్​సమీపంలో రంధ్రం పడిందని రష్యా ఫెడరల్​ ఏజెన్సీ వెల్లడించింది. ట్యాంకర్ లో 11మంది సిబ్బంది ఉన్నారని అయితే డ్రోన్ల దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని క్రెమ్లిన్​ వెల్లడించింది.