మా సైనికులు ఎవరూ చనిపోలేదు

మా  సైనికులు ఎవరూ చనిపోలేదు

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే మరో వైపు దాడిని కొనసాగిస్తోంది . ఇప్పటికే దాదాపు 10 కి పైగా సిటీలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న రష్యన్ బలగాల.. తాజాగా మరో సిటీపై పట్టు సాధించాయి.   ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ సిటీని ఆక్రమించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎయిర్, షిప్ బేస్డ్ మిస్సైల్స్ తో దాడులు చేసి ఉక్రెయిన్ లోని మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

మరో వైపు రష్యా సైనిక చర్యలను దీటుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపు 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ట్వీట్ చేసింది. 200 మంది సైనికులు బందీలుగా ఉన్నారని తెలిపింది. 14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చామని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని చెప్పారు. అయితే తమ సైనికులు ఎవరూ చనిపోలేదని రష్యా ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ