ఉక్రెయిన్ లో74 మిలటరీ టార్గెట్లు ధ్వంసం

ఉక్రెయిన్ లో74 మిలటరీ టార్గెట్లు ధ్వంసం
  • ఉక్రెయిన్ లో74 మిలటరీ టార్గెట్లు ధ్వంసం
  • ఎయిర్ ఫీల్డ్ లు, రాడార్లనూ నాశనం చేసినం: రష్యా  
  • 203 చోట్ల దాడులు జరిగినయ్: ఉక్రెయిన్ పోలీసులు 

కీవ్​: ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 74 మిలటరీ ఫెసిలిటీలను ధ్వంసం చేశామని గురువారం రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. ఎయిర్ స్ట్రైక్స్ లో 11 ఎయిర్ ఫీల్డులు, 3 కమాండ్ పోస్టులు, ఎస్300, బుక్ఎంఐ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ కు సంబంధించిన 18 రాడార్ స్టేషన్లు కూడా ఉన్నాయన్నారు. ఒక మిలటరీ హెలికాప్టర్, నాలుగు డ్రోన్ లనూ నేలకూల్చామన్నారు. అలాగే తమ గ్రౌండ్ ఫోర్సెస్ నార్త్, సౌత్, ఈస్ట్.. మూడు దిక్కుల్లోనూ ముందుకు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. రెబెల్స్ కూడా రష్యన్ బలగాల ఎయిర్ సపోర్ట్ తో ముందుకు కదులుతున్నారని చెప్పారు. ఉక్రెయిన్ సోల్జర్లను రెస్పెక్ట్ తో చూడాలని తమ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా, గురువారం ఉదయం బాంబింగ్స్ మొదలైనప్పటి నుంచీ 203 చోట్ల రష్యా దాడులు చేసిందని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ పోలీసులు వెల్లడించారు. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా పోరాటం కొనసాగుతోందని తెలిపారు. రాజధాని కీవ్ కు దక్షిణ ప్రాంతంలో 14 మంది సోల్జర్లతో వెళ్తున్న మిలటరీ ప్లేన్ క్రాష్ అయిందని అధికారులు చెప్పారు.