సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్య విద్యార్థులు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్య విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ స్టూడెంట్ల పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. వారికి దేశంలోని కాలేజీల్లో సీట్లు కేటాయించడంపై పిటిషనర్ల వాదనలు సుప్రీంకోర్టు విననుంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించలేమని గతంలోనే కేంద్రం తెలిపింది. దీనిపై సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ లోని యూనివర్సిటీలు, కాలేజ్ ల అనుమతితో వేరే దేశాల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసేందుకు అవకాశమిస్తామని తెలిపింది. 

ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన తమకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలంటూ ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NSC నిబంధనల ప్రకారం స్టూడెంట్లకు దేశంలోని కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఆయా కళాశాలల అనుమతితో కోర్సు పూర్తి చేయవచ్చని ఈనెల 6న ప్రకటన ఇచ్చామని తెలిపింది. ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి ఈ విషయంపై స్పష్టత రానుంది.