కాంగ్రెస్ మాటిస్తే తప్పదు..పంద్రాగస్టులోపు రుణమాఫీ : వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ మాటిస్తే  తప్పదు..పంద్రాగస్టులోపు రుణమాఫీ : వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గతంలో ఏకకాలంలోనే కాంగ్రెస్  రుణమాఫీ చేసిందని చెప్పారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతుందన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపాలన్నారు. కార్మికుడి కొడుకని చెప్పుకుంటున్న కొప్పలు ఈశ్వర్ సింగరేణి కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్, బాల్కసుమన్ గత పదేళ్లుగా చేసిందేమి లేదన్నారు.  వంశీని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.

పెద్దపల్లి లోక్ సభ  స్థానంలో  కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  గడ్డం వంశీకృష్ణకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయన్నారు.   దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు.  కేంద్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు.  దేశంలో మోదీ ఇస్తామన్న రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు . బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలను పెంచారని చెప్పారు.  కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ధరలు తక్కువగా ఉండేవన్నారు.  

కార్మికుల ద్రోహి బీఆర్ఎస్: వంశీకృష్ణ

సింగరేణి కార్మికుల ద్రోహి బీఆర్ఎస్.. దళితుల ద్రోహి పార్టీ బీజేపీ అని  పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.   బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. . బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. సింగరేణి కార్మికులను గత పాలకులు నాశనం చేశారని విమర్శించారు.  సింగరేణి కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కార్మికుల కోసం కొప్పుల ఏం చేశారని ప్రశ్నించారు.