
కల్వకుర్తి, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష పడినట్లు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. ఊరుకొండ మండలానికి చెందిన కృష్ణయ్య అధికంగా మద్యం తాగి వాహనం నడుపుతుండగా కల్వకుర్తి పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కావ్య అతనికి నాలుగు రోజులు జైలు శిక్ష, రూ. 500 ఫైన్ విధించినట్లు ఎస్సై తెలిపారు.