ఇంటి అద్దెలు కట్టలేక శివార్లకు మారుతున్నరు

ఇంటి అద్దెలు కట్టలేక శివార్లకు మారుతున్నరు
  • సిటీలో జాబ్.. శివార్లలో ఇళ్లు
  • ఇంటి అద్దెలు కట్టలేక అక్కడి నుంచే ఆఫీసులకు పరుగులు
  • బస్​పాస్​ తీసుకుని డైలీ అప్​ అండ్ ​డౌన్​
  • చాలీచాలని జీతాలతో బతుకు బండి లాగిస్తున్న చిరు ఉద్యోగులు

అమీర్ పేటలోని రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కార్పొరేట్ ​ఆఫీసులో జాబ్ చేసే శివ రెండేళ్ల కింద వరకు స్థానికంగా సింగిల్​బెడ్ రూం​ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఉండేవాడు. అప్పుడు రూ.8వేల రెంట్​కట్టేవాడు. లాక్​డౌన్ తర్వాత ఇంటి అద్దె, ఖర్చులు పెరగడం, ఆదాయం పెరగకపోవడంతో సిటీ శివారులోని బాచుపల్లికి షిఫ్ట్​ అయ్యాడు. అక్కడ అదే సింగిల్​ బెడ్​రూం ఇంటికి రూ.5వేలు కడుతున్నాడు. డైలీ అక్కడి నుంచే బస్సులో అమీర్​పేటకు అప్​ అండ్​ డౌన్​ చేస్తున్నాడు.
 

బోరబండలో ఉంటూ బేగంపేటలోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్న జనార్దన్ నెలకి రూ.10వేల అద్దె చెల్లించలేక శివారు ప్రాంతమైన బండ్లగూడ జాగీర్​కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ రూ.6 వేలకే డబుల్ బెడ్​రూం ఇల్లు దొరకడంతో దూరమైనా అక్కడి నుంచే డైలీ డ్యూటీకి వెళ్తున్నాడు.


హైదరాబాద్, వెలుగు: సిటీలోని ఇండ్ల అద్దెలు కట్టలేని, ఖర్చులు భరించలేని చిరు ఉద్యోగులు బతుకు బండి లాగేందుకు శివారు ప్రాంతాలకు షిఫ్ట్​అయ్యారు. లాక్​డౌన్ టైంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన చాలా మంది ఇప్పటికే మకాం మార్చేశారు. సిటీతో పోల్చుకుంటే శివారుల్లో ఇళ్ల కిరాయిలు తక్కువగా ఉండటంతోపాటు సంపాదించే మొత్తంతో మంచిగా బతకొచ్చని ఫిక్స్ అయ్యారు. ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లేందుకు దూరమైనా అక్కడి నుంచే డైలీ సర్వీస్ చేస్తున్నారు. ఎక్కువగా బడంగ్​పేట్, బండ్లగూడ జాగీర్, నార్సింగి, బోడుప్పల్, నాచారం, దమ్మయిగూడ, ఘట్ కేసర్, రామచంద్రాపురం, పటాన్​చెరు, నానక్ రామ్ గూడ తదితర ప్రాంతాల నుంచి కోర్​సిటీకి వచ్చి డ్యూటీలు చేస్తున్నారు. బస్సు పాస్ తీసుకొని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. 
కరోనా నేర్పిన పాఠం
కరోనా టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు సాగక నష్టపోయారు. వారిలో 90 శాతం చిరు ఉద్యోగులే ఉన్నారు. ఉపాధి కరువై నానా ఇబ్బందులు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇండ్ల యజమానాలు అద్దెలు పెంచేశారు. దాంతో కోర్​సిటీలో ఉండడటం కష్టమని ఫిక్స్​అయిన ఉద్యోగులు సింగిల్ బెడ్ రూం ఇంటికి రూ.10 నుంచి 12 వేలు చెల్లించలేక సిటీ శివార్లకు షిఫ్ట్ అయ్యారు. వారి స్థోమతకు తగ్గట్టు అపార్ట్​మెంట్లు, ఇండివిడ్యువల్​హౌస్​వెతుకున్ని మారిపోయారు. ఇప్పటికీ అక్కడి నుంచే సిటీకి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. సిటీ అవుట్ స్కట్స్ అద్దెలు తక్కువగా ఉండటంతో ఖర్చులు తగ్గుతున్నాయంటున్నారు. రోజూ వచ్చి వెళ్లేందుకు రూ.30 ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ నుంచి ఆఫీసు బాయ్, హౌజ్ కీపింగ్ వర్కర్లు ఇలా దాదాపు ఇదే ఫాలో అవుతున్నారు.
అద్దె తక్కువని షిఫ్ట్ అయిన
సిటీలో ఈవెంట్ మేనేజర్​గా పని చేస్తున్న. గతంలో మాసబ్ ట్యాంక్​లో ఉండేవాన్ని. కరోనా టైంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక హిమాయత్​ సాగర్ కి షిఫ్ట్ అయ్యాను. అక్కడితో పోలిస్తే నెలకి రూ.3వేలు సేవ్​ అవుతున్నాయి. తిరగడానికి ఇబ్బంది అవుతున్నప్పటకీ తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తోంది.- మల్లికార్జున్, ప్రైవేట్ ఎంప్లాయ్
దూరమైనా సరే వస్తున్న
డైలీ బాలాపూర్ నుంచి వచ్చి ఆరాంఘర్ వద్ద ఫ్రూట్స్ అమ్ముతున్న. సిటీలోని ఇంటి అద్దెలు కట్టలేక అక్కడే ఉంటున్న. వచ్చిన దాంతో అక్కడే జీవిస్తున్న. ఒక్కో సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. - సల్మాన్, పండ్ల వ్యాపారి