అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌: నేడు సౌతాఫ్రికాతో ఫస్ట్​ ఫైట్​.

అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌: నేడు సౌతాఫ్రికాతో ఫస్ట్​ ఫైట్​.
  • నేడు సౌతాఫ్రికాతో ఫస్ట్​ ఫైట్​
  • రా.7.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో

జార్జ్‌‌‌‌టౌన్‌‌ (గయానా): నాలుగుసార్లు చాంపియన్‌‌ ఇండియా.. అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌ కోసం రెడీ అయ్యింది. శనివారం జరిగే తమ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌లోనే బోణీ కొట్టి కాన్ఫిడెన్స్‌‌ పెంచుకోవాలని రెండు టీమ్స్​ పక్కా స్కెచ్‌‌ వేసుకుంటున్నాయి. దుబాయ్‌‌లో ఆసియా కప్‌‌ నెగ్గడంతో.. మెగా టోర్నీలోనూ ఇండియా ఫేవరెట్‌‌గా మారింది. నాలుగుసార్లు చాంపియన్‌‌షిప్‌‌తో పాటు లాస్ట్‌‌ త్రీ ఎడిషన్స్‌‌లో టీమిండియా ఫైనల్‌‌కు చేరుకుంది. అయితే 2020లో ఆడిన ప్లేయర్లు ఒక్కరు కూడా ఈసారి టోర్నీలో బరిలోకి దిగడం లేదు.

అయినప్పటికీ కుర్రాళ్లు హర్నూర్‌‌ సింగ్‌‌, రాజవర్ధన్‌‌, కెప్టెన్‌‌ యష్‌‌ ధూల్‌‌, వైస్​ కెప్టెన్​ షేక్ రషీద్​, రవి కుమార్‌‌ ఇప్పటికే తమ సత్తా ఏంటో చూపెట్టారు. గ్రూప్‌‌–బిలో ఇండియాతో పాటు ఐర్లాండ్‌‌, ఉగాండా, సౌతాఫ్రికా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో గెలిచినోళ్లకు నాకౌట్‌‌కు చేరుకునే చాన్సెస్‌‌ పెరుగుతాయి. మరోవైపు 2014 విన్నర్‌‌ సౌతాఫ్రికాను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆల్‌‌రౌండర్‌‌ బ్రెవీస్‌‌పై ప్రొటీస్‌‌ భారీ ఆశలు పెట్టుకుంది. డివిలియర్స్‌‌ బ్యాటింగ్‌‌ పోలికలు ఉన్న బ్రెవీస్‌‌.. లెగ్‌‌ స్పిన్‌‌ వేయడంలో దిట్ట. ఓవరాల్‌‌గా సఫారీలపై గెలిస్తే టోర్నీలో మనకు తిరుగుండకపోవచ్చు.