
గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. బ్రిడ్జ్ కూలడంతో ట్రాక్టర్, ఆటో కూడా నుజ్జునుజ్జయ్యాయి. అంబాజీకి వెళ్లే పాలన్‌పూర్ ఆర్‌టీఓ సర్కిల్ మార్గంలో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. విషయం తెలియగానే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కాగా గతేడాది గుజరాత్ లోని మోర్చిలోని మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోవడంతో 132 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
#WATCH | A portion of an under-construction bridge collapses in Gujarat's Palanpur
— ANI (@ANI) October 23, 2023
Details awaited. pic.twitter.com/eVPdgGsIBt