కారు యాక్సిడెంట్..రాజ్ తరుణ్ పోలికలు!

కారు యాక్సిడెంట్..రాజ్ తరుణ్ పోలికలు!

ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ రోడ్ వద్ద ఓ కారు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ కాంపౌండ్ వాల్ ని డీకోట్టి కారు లోపలికి దూసుకుపోయింది. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే కారును స్పాట్ లోనే వదిలేసిన వ్యక్తి స్పాట్ నుండి పరార్ అయ్యాడు. దీంతో కారుని రికవరీ చేసిన పోలీసులు కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

అయితే సీసీటీవీ ఫుటేజీలో పరుగెత్తుతున్న వ్యక్తి హీరో రాజ్ తరుణ్ పోలికలు ఉండటంతో న్యూస్ ఛానెళ్లలో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రమాదానికి గురైన కారు ఎవరిదనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఓల్వో కారు ఎవరిదనేది మిస్టరీగా మారింది . ప్రమాదం జరిగి 12 గంటలు దాటినా ఆకారు ఎవరిదనేది పోలీసులు కూడా గుర్తించకపోవడం గమనార్హం.