
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆటాడిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆస్తులపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ పైవిధంగా కామెంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌తోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి సంస్థలను ప్రభుత్వం తన ఇష్టానికి తగ్గట్లు డ్యాన్స్ చేయిస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. తమకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దుతగా నిలుస్తున్న వారిపై ఫ్రెండ్లీ మీడియాతో కేంద్రం అటాక్ చేయిస్తోందని రాహుల్ విమర్శించారు.